Tirupati Govindaraja Temple Festivals January 2026.. The details of the special festivals to be held in January 2026 at Sri Govindaraja Swamy Temple in Tirupati :
– On January 1st, on the occasion of Rohini Nakshatra, at 6 PM, Sri Parthasarathy Swamy, along with Rukmini and Satyabhama, will be taken on a procession through the temple streets to bless the devotees.
– On January 2nd and 23rd, on Fridays at 6 PM, Sri Andal Ammavaru will bless the devotees in the temple streets.
– January 3rd, 2026: Pournami Garuda Seva
– January 5th, 2026: Sri Govindaraja Swamy’s procession to Ramachandra Teertham.
– January 7th to 13th, 2026: Sri Andal Ammavari Neerattotsavam (Bathing festival).
– January 14th, 2026: Bhogi Theru (Bhogi Chariot Festival).
– January 15th, 2026: Makara Sankranti.
– January 16th, 2026: Goda Kalyanam (Goda’s Wedding).
– January 17th, 2026: Paruveta Utsavam (Hunting Festival) on the occasion of Kanuma festival.
Adhyayanotsavams will be held from January 18th to February 10th.
– On January 20th, coinciding with the Shravana Nakshatra, at 6 PM, Sri Kalyana Venkateswara Swamy, along with his consorts, will bless the devotees in the four mada streets of the temple town.
– January 25, 2026: Ratha Saptami.
– Float festivals will be held from January 27th to February 1st.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జనవరి – 2026 నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
–జనవరి 1న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
– జనవరి 2, 23వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
– జనవరి 3న పౌర్ణమి గరుడసేవ
– జనవరి 5న శ్రీ గోవిందరాజస్వామివారు రామచంద్రతీర్థ కట్టకు వేంచేపు.
– జనవరి 7 నుండి 13వ తేదీ వరకు శ్రీ ఆండాల్ అమ్మవారి నీరాటోత్సవం.
– జనవరి 14న భోగి తేరు.
– జనవరి 15న మకర సంక్రాంతి.
– జనవరి 16న గోదా కల్యాణం
– జనవరి 17న కనుమ పండుగ సందర్భంగా పార్వేటి ఉత్సవం.
– జనవరి 18 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు
–జనవరి 20న శ్రవణా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
– జనవరి 25న రథసప్తమి.
– జనవరి 27 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.