No Annaprasadam at TTD Temple on Chandra Grahan day, 3 March 2026

On Tuesday, 3 March 2026, in view of the lunar eclipse, the Annaprasadam distribution centres run by Tirumala Tirupati Devasthanams (TTD) in Tirupati and Tiruchanoor will remain closed.

Accordingly, the SV Nitya Annaprasadam building at Thollappa Gardens in Tiruchanoor, the employees’ canteen in the TTD Administrative Building at Tirupati, the canteen at Sri Padmavathi Rest House, and the free Annaprasadam distribution centres at Srinivasam and Vishnunivasam accommodation complexes will temporarily stop serving free meals to devotees on that day.

However, Annaprasadam for patients and their attendants at government hospitals and various first aid centres in Tirupati will be distributed in advance.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మార్చి 3 చంద్రగ్రహణం సందర్భంగా టిటిడి అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేత

మార్చి 3వ తేదీ మంగళవారం రోజున చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి మరియు తిరుచానూరులోని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నారు.

ఇందులో భాగంగా తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్‌లో గల ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్‌, అలాగే శ్రీనివాసం మరియు విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తారు.

అదేవిధంగా తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు మరియు వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు మరియు వారి సంరక్షకులకు అందించే  అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading