The ancient temple of Sridevi Bhudevi Sametha Sri Venakteswara Swamy temple, in Upamaka Village at Visakhapatnam is all set ready for the annual brahmotsavams from 29 September to October 8.
The nine day fete in this newly taken over temple of Upamaka will commence with Ankurarpanam on September 29 and end on October 8.
The Special Sevas include Pedda Pallaki Utsavam, Hanumantha Vahanam, Seshathalpa Vahanam, Hamsa Vahanam, Garuda Vahanam, Rathotsavam, etc..
TTD has made elaborate arrangements for the mega religious festival.
సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2019 సెప్టెంబరు 25: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 29న ఉదయం 9.52 గంటలకు తిరువీధిలో బ్రహ్మోత్సవ కావడి ఊరేగింపుతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఆ తరువాత చిన్నపల్లకీ ఉత్సవం, అశ్వ వాహనసేవ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
30 September 2019 – పెద్ద పల్లకీ ఉత్సవం రాజధిరాజ
1 October 2019 – హనుమంత వాహనం ఇత్తడి సప్పరం
2 October 2019 – శేషతల్ప వాహనం హంస వాహనం
3 October 2019 – రాజధిరాజ పెద్ద పల్లకీ
4 October 2019 – పెద్దపల్లకీ ఉత్సవం శేషతల్ప వాహనం
5 October 2019 – వసంతోత్సవం – ఇత్తడి గరుడవాహనం
6 October 2019 – పుణ్యకోటి – రథోత్సవం
7 October 2019 – గజవాహనం – మృగవేట
8 October 2019 – పల్లకీ (వినోదోత్సవం) విజయదశమి(పుణ్యకోటి వాహనం)
సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీ చక్ర పెరుమాళ్‌ను చిన్న పల్లకీపై తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.