Narayanavanam Kalyana Venkateshwara Swamy Temple Brahmotsavam 2020… The annual brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam will be observed from 1 June to 10 June 2020.
This ancient temple under the fold of TTD is located at around 38 kms from Tirupati. The historical importance is that Lord Venkateswara was engaged to Goddess Padmavathi in this temple only.
The important days during the nine day fete includes Dhwajarohanam on June 2, Garuda Vahanam on June 6, Rathotsavam on June 9, Chakrasnanam on June 10. While Koil Alwar Tirumanjanam and Ankurarpanam will be performed on May 26 and June 1 respectively.
Schedule of Narayanavanam Kalyana Venkateshwara Swamy Temple Brahmotsavam 2020
1 June 2020, Monday
Morning –
Evening – Ankurarpana
2 June 2020, Tuesday
Morning – Tiruchi Utsavam, Dhwajarohanam
Evening – Pedda Sesha Vahanam
3 June 2020, Wednesday
Morning – Chinna Sesha Vahanam
Evening – Hamsa Vahanam
4 June 2020, Thursday
Morning – Simha Vahanam
Evening – Mutyapu Pandiri Vahanam
5 June 2020, Friday
Morning – Kalpavruksha Vahanam
Evening – Sarvabhoopala Vahanam
6 June 2020, Saturday
Morning – Mohini Avatara Utsavam in Pallaki
Evening – Garuda Vahanam
7 June 2020, Sunday
Morning – Hanumath Vahanam, Salakatla Vasantothsavam
Evening – Gaja Vahanam
8 June 2020, Monday
Morning – Surya Prabha Vahanam
Evening – Chandra Prabha Vahanam
9 June 2020, Tuesday
Morning – Rathotsavam
Evening – Ashwavahanam
10 June 2020, Wednesday
Morning – Pallaki Utsavam, Tirthavari Avabhruthothsavam, Chakrasnanam
Evening – Tiruchi Utsavam, Dhwajavarohanam, Dwadasharadhanam, Ekantothsavam
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
2019
మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2019 మే 27: టిటిడి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 16 నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
16-05-2019(గురువారం) ధ్వజారోహణం(ఉ|| 10 నుంచి 11 వరకు) పెద్దశేష వాహనం
17-05-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
18-05-2019(శనివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
19-05-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
20-05-2019(సోమవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
21-05-2019(మంగళవారం) హనుమంత వాహనం గజ వాహనం
22-05-2019(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
23-05-2019(గురువారం) రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం
24-05-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 23వ తేదీ రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
మే 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 12వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మే 16 నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 3.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.