Applications for Sri Venkateswara Music and Dance College and SV Nadaswaram & Dolu School Admissions invited

Applications for Sri Venkateswara Music and Dance College and SV Nadaswaram & Dolu School Admissions invited for 2026-2027 year…

Applications are invited for admissions into various regular and part-time courses for the academic year 2026–27 at Sri Venkateswara Music and Dance College and SV Nadaswaram & Dolu School, run by TTD in Tirupati.

Application forms will be issued from June 2, and completed applications will be accepted until June 30.

Courses offered include Vocal Music, Veena, Flute, Violin, Nadaswaram, Dolu, Bharatanatyam, Kuchipudi, Harikatha, Mridangam, and Ghatam under B.Music, B.Dance, Visarada, and Praveena streams.

Interested candidates can obtain applications by paying ₹50 during office hours. Hostel facility is available for eligible students enrolled in regular courses, subject to rules.

For details, contact: 0877-2264597, 9848374408, 9440793205, 9642796991.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                        జూన్ 3 తేదీ నుండి ఎస్వీ సంగీతనృత్య‌ కళాశాలనాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో ప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం

టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పలు రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూన్ 2వ తేదీ నుండి క‌ళాశాల‌లో ద‌ర‌ఖాస్తులు జారీ చేస్తారు. పూర్తిచేసిన ద‌ర‌ఖాస్తులను జూన్ 30వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తారు.

కళాశాలలో ఫుల్ టైమ్‌ / పార్ట్‌టైమ్ వ్య‌వ‌ధి గ‌ల కోర్సులలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాలున్నాయి. బి.మ్యూజిక్‌, బి డ్యాన్స్‌, విశారద, ప్రవీణ కోర్సులున్నాయి.

ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్‌, డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులతోపాటు సాయంత్రం కళాశాల పార్ట్‌టైమ్‌ కోర్సులున్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రెగ్యులర్ కోర్సు చదివే  విద్యార్థుల‌కు మాత్రమే నిబంధనలకు లోబడి హాస్ట‌ల్ వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఇతర వివరాలకు 0877-2264597,  9848374408, 9440793205, 9642796991 నంబ‌ర్ల‌లో సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading