Anantha Padmanabha Vratham in Tirumala Temple – 12 September 2019

As a part of its annual practice the TTD plans to grandly organise Ananta Padmanabha Swamy vratam on Bhadrapada Shukla Chaturdashi day on September 12, 2019.

The anthropomorphic form of Sri Sudarshana Chakrathalwar will be rendered Chakra Snanam in Swami Pushkarani on Thursday morning and will return to the Srivari temple.

Senior TTD officials and temple priests participate in the event.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 12న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

తిరుమల, 2019 సెప్టెంబ‌ర్ 07: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్ల చతుర్థశి పర్వదినాన అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 12వ తేదిన అనంత పద్మనాభ వ్రతాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.

కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణికి చెంతకు అర్చకులు ఆగమోక్తంగా తీసుకువెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 6.00 నుండి 7.00 గంట‌ల నడుమ ఘనంగా జరుగనుంది. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.

ఈ కార్య‌క్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పాల్గొంటారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment