Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Keelapatla Konetiraya Swamy Temple Brahmotsavam 2019

The annual brahmotsavams in Sri Konetiraya Swamy temple in Palamaneru, about 90km from Tirupati, will be observed from May 12 to 20, 2019 by TTD.

The important days includes Dhwajarohanam on May 12, Garuda Seva and Kalyanam on May 16, Rathotsavam on May 19 and Chakrasnanam on May 20.

The Grihasta devotees who are willing to take part in Kalyanam shall pay Rs.300 per ticket on which two persons will be allowed.

Meanwhile Tirupati JEO Sri B Lakshmikantham released the wall posters related to the religious event in his camp office on Wednesday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 12 నుండి 20వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

గోడపత్రికలు ఆవిష్కరించిన జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుపతి, 2019 మే 01: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం బుధ‌వారం ఆవిష్కరించారు. తిరుప‌తిలోని జెఈవో క్యాంపు కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 12 నుండి 21వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామ‌ని తెలిపారు. మే 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంద‌ని, 11న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

తేదీ ఉదయం సాయంత్రం

12-05-2019(ఆది) ధ్వజారోహణం(మిథునలగ్నం) శేష వాహనం

13-05-2019(సోమ‌) తిరుచ్చిఉత్సవం హంస వాహనం

14-05-2019(మంగ‌ళ‌) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

15-05-2019(బుధ‌) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

16-05-2019(గురు) మోహినీ ఉత్సవం కల్యాణోత్సవం, గరుడ వాహనం

17-05-2019(శుక్ర‌) హనుమంత వాహనం వసంతోత్సవం, గజ వాహనం

18-05-2019(శ‌ని) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

19-05-2019(ఆది) రథోత్సవం అశ్వవాహనం

20-05-2019(సోమ‌) చక్రస్నానం ధ్వజావరోహణం.

ఉత్సవాల్లో భాగంగా మే 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌య‌, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, టెంపుల్ ఇన్స్‌పెక్ట‌ర్ శ్రీ మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment