Telugu – Brindavana Dwadashi

Here is the description on Brindavana Dwadashi in Telugu…

క్షీరాబ్ది ద్వాదశిని ” బృందావన ద్వాదశి” అంటారు. ఈ రోజు ఉదయం ముందు రోజు ( ఏకాదశి) ఉపవాసానికి ఉపసమ్హరణగా, విష్ణువునకు నివేదించిన ఆహార పదార్ధాలను పారణగా స్వీకరించాలి.

కచ్చిత్తులసి! కల్యాణి! గోవింద చరణప్రియే!
ధాత్రిదేవి నమస్తేస్తు మాం పాలయ మనోరమే!

ఈ ద్వాదశి నాడు తులసీమంటపమున ఉసిరి కొమ్మును పెట్టుకొని, ( లేదా ఉసిరి చెట్లు తులసి ఉన్నచోట) , వివిధ దీపములతో అలంకరించుకుని విష్ణుపూజ చేయాలి. దీనిని “క్షీరాబ్ది ద్వాదశి వ్రతం” అంటారు. ఉసిరికను విష్ణువునకు నివేదించడం, 360 వత్తులతో మహాజ్యోతిని వెలిగించడం ఆచారం. హరిహరుల పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి దివ్య సాధన ఇది.

ఉసిరిక ( అమలకం) ఈ మాసాన శ్రేష్టంగా చెప్పవచ్చు. ఉసిరిక దైవానికి నివేదించడం , దానం చేయడం, భుజించడం – దైవానుగ్రహ హేతువు. సంవత్సరం లో ఏ రోజైనా దీపారధన చేయని దోషం, ఈ రోజున 360 వత్తులతో వెలిగించే దీపం వల్ల తొలుగుతుంది.

Write Your Comment