The following are the list of festivals being observed in Sri Govindaraja Swamy temple in February 2026..
Sri Govindarajaswami Temple is one of the most important temples in Tirumala Tirupati. It has an imposing gopuram which can be seen from a distance.
Saint Ramanujacharya consecrated the temple in 1130 AD.
The festivals and functions are similar to those conducted in the Sri Venkateswara temple. The annual Brahmotsavam at this temple is celebrated in the month of Vaisakha every year. The annual float festival is also celebrated every year.
February 1, 2026: Conclusion of the Teppotsavams
February 3, 2026: Pranaya Kalahotsavam
February 5, 2026: In connection with Uttara Nakshatra, procession along the four mada streets at 6.00 p.m.
February 7, 2026: As part of Adhyayanotsavams Pedda Sattumora.
February 10, 2026: On the concluding day of Adhyayanotsavams, Sri Govindarajaswamy along with Sridevi and Bhudevi, Sri Andal Ammavaru, Senadhipati and Alwars will be taken in a grand procession in the morning to Alwar Theertham near Kapila Theertham, where Sattumora and Asthanam will be conducted. Later, the deities will return to the temple.
February 12, 2026: On the occasion of Garuda Seva as part of the Brahmotsavams of Sri Kalyana Venkateswaraswamy at Srinivasamangapuram, the garlands of Sri Andal Ammavaru will be taken in a procession from Sri Govindarajaswamy Temple at 6.30 a.m.
February 16, 2026: Shravana Nakshatra and procession of Sri Kalyana Venkateswaraswamy along with Sridevi and Bhudevi
February 25, 2026: On the occasion of Rohini Nakshatra, Sri Parthasarathiswamy along with Rukmini and Satyabhama will take a procession at 6 p.m.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఫిబ్రవరిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2026 జనవరి 22: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– ఫిబ్రవరి 1న శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ముగింపు.
• ఫిబ్రవరి 3న ప్రణయ కలహ మహోత్సవం సందర్భంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
• ఫిబ్రవరి 5న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
• ఫిబ్రవరి 6, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం సాయంత్రం 6 గంటలకు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
• ఫిబ్రవరి 7న అధ్యాయనోత్సవాలలో భాగంగా పెద్ద శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీనమ్మళ్వార్ ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
– ఫిబ్రవరి 10న అధ్యాయనోత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, సేనాధిపతివారు, ఆళ్వార్లు కపిలతీర్థం వద్దగల ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి శాత్‌మొర, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
• ఫిబ్రవరి 12న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించనున్న గరుడసేవ సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు.
– ఫిబ్రవరి 16న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
– ఫిబ్రవరి 25న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.