Pushpa Yagam, Vrashika (annual) Pushpa Yagam, is a ritual performed at Tirumala Tirupati Sri Venkateshwara temple during Kartika masam. During this puja, Lord Balaji is worshipped with tones of flowers that grown in Srivari udyanavanam (Flower gardens of TTD). In 2025, Pushpa Yagam date is October 30.
As part of this, Ankurarpanam will be conducted on October 29 between 8 PM and 9 PM.
On the day of Pushpayagam, after the Second Archana, Second Bell and Naivedyam, the processional deities Sri Malayappa Swamy along with His consorts Sri Devi and Bhu Devi will be taken to the Kalyana Mandapam at the Sampangi Prakaram, where Snapana Tirumanjanam will be performed.
From 1 PM to 5 PM, the grand Pushpayagam will be conducted, using various types of flowers and holy leaves.
Later in the evening, after the Sahasra Deepalankara Seva, Sri Malayappa Swamy will bless the devotees with a procession along the four mada streets.
Cancellation of Arjitha Sevas
Due to Ankurarpanam on October 29, the Sahasra Deepalankara Seva in the evening has been cancelled by TTD.
On October 30, the day of Pushpayagam Tiruppavada Seva, Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam sevas are cancelled.
The Tomala Seva and Archana will be performed in Ekantam.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
అక్టోబర్ 29న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.