TTD is organising the annual Pavitrotsavam fete at Sri Vedavalli sameta Veda Narayana Swami temple, Nagalapuram from November 19 – 20 November in 2022.
The ritual is aimed at making temple premises sin-free following year-long fetes, utsavas and possible lapses, inadvertently if any, committed by devotees or Archakas or officials.
As per the schedule of events Ankurarpanam is held on November 19 evening, Snapana thirumanjanam for utsava idols of Swami and consorts on November 20 followed by Pavitra pratista, Pavitra samarpana and Purnahuti at night.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు నవంబరు 19, 20వ తేదీల్లో జరుగనున్నాయి.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
నవంబరు 19న సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ జరుగనుంది. 20న ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, రాత్రి పూర్ణాహుతి నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.