Nyaya Sudha, Propagating Venkateshwara Bhakti cult

HH Sri Suvidyendra Thirtha Swamiji of Bengaluru Sri Raghavendra Mutt, advocated that Sri Venkateswara Bhakti cult will be wide spread with the help of the great work of Nyaya Sudha penned by Sri Jayatheertha.

Speaking on the final day of Sri Jayatheertha Aradhanotsava arranged under the aegis of Dasa Sahitya Project of TTD in Asthana Mandapam at Tirumala on Monday, the pontiff said that Sri Jayatheertha has combined the essence of Ramayana, Mahabharata and Bhagavata into one and penned Nayaysudha.

Project Special Officer Dr PR Anandatheerthacharyulu, 2500 bhajan bhaktas and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జయతీర్థుల ‘న్యాయసుధ’ సాహిత్యంతో శ్రీవారి వైభవం వ్యాప్తి : శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ

తిరుమ‌ల‌లో ముగిసిన శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు

తిరుమల, 2019 జూలై 22: శ్రీ జయతీర్థులవారు ‘న్యాయసుధ’ సాహిత్యంతో ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు విశేషంగా కృషి చేశారని బెంగళూరుకు చెందిన శ్రీ రాఘ‌వేంద్ర‌స్వామి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు సోమ‌వారం ఘనంగా ముగిశాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ మంగళశాసనాలు చేస్తూ జయతీర్థుల వారు రామాయ‌ణం, మ‌హ‌భార‌తం, భాగ‌వ‌తం త‌దిత‌ర అన్ని గ్రంథ‌ల సారాంశ‌మే న్యాయ‌సుధ‌లో పొందుప‌ర్చిన‌ట్లు తెలిపారు. లోకం సుభిక్షంగా ఉండాల‌ని తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం న్యాయసుధ పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. వీరి సాహిత్యాన్ని శ్రీ పురందరదాసులవారు గ్రహించి అపారమైన వేలాది సంకీర్తనలు రచించారని తెలిపారు. భక్తిమార్గంతోనే మానవులకు ముక్తి చేకూరుతుందన్నారు.

అనంత‌రం దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ భజన మండళ్ల సభ్యులు శ్రీ జయతీర్థులవారి సాహిత్యాన్ని, పురందరదాసులవారి కీర్తనలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఆయా గ్రామాల్లో ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం భజన మండళ్లను బలోపేతం చేసేందుకు సభ్యుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు.

కాగా, భజన మండళ్ల సభ్యులు సుప్రభాతం, ధ్యానం, శ్రీజయతీర్ధుల సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 2,500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading