Kosuvaripalle Temple Brahmotsavam 2020 – 26 January to 3 February

The annual brahomostavams of Sri Prasanna Venkateswara Swamy in Kosuvaripalle will commence from January 26 with Dhwajarohanam and conclude on February 3 with Chakrasnanam.

The important days include Pedda Sesha Vahanam on January 29, Kalpavriksham on January 31, Suryaprabha on February 1, Garuda Vahanam on February 2. On the same day there will be Kalyanotsavam where in couple will be allowed to take part on the payment of Rs.300.

On February 6, a day after the nine day brahmotsavams, there will be Pushpayagam between 5pm to 8pm.

Following are the special events of the Brahmotsavams:

26 January 2020: Dwajarohanam (morning) Pallaki utsavam (evening)

27 January 2020 Pedda Sesha vahanam and    Hamsa vahanam

28 January 2020 -Muthayapupandiri  – Simha Vahanam

29 January 2020 Kalpavruksha  — Hanumantha

30 January 2020 Surya Prabha   — Chandraprabha

31 January 2020: Sarvabhoopala vahanam, Kalyanotsavam and Garuda Vahanam

1 February 2020: Rathotsavam

2 February 2020: Pallaki Utsavam and Aswa vahanam

3 February 2020: Chakra snanam and Dwaja avarohanam

TTD is also organizing the Pushpa yagam at the temple on February 4.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కోసువారిపల్లి  శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 డిసెంబ‌రు 25: టిటిడికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జనవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                    ఉదయం                   రాత్రి

26 జనవరి 2020(ఆదివారం)   ధ్వజారోహణం           పల్లకీ ఉత్సవం

27 జనవరి 2020(సోమ‌వారం)  పెద్దశేషవాహనం         హంసవాహనం

28 జనవరి 2020(మంగ‌ళ‌వారం)  ముత్యపుపందిరి వాహనం సింహవాహనం

29 జనవరి 2020(బుధ‌వారం)   కల్పవృక్ష వాహనం        హనుమంత వాహనం

30 జనవరి 2020(గురువారం)   సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

31 జనవరి 2020(శుక్ర‌వారం)   సర్వభూపాల వాహనం       కల్యాణోత్సవం, గరుడవాహనం

1 ఫిబ్రవరి 2020(శ‌నివారం)    రథోత్సవం                         గజ వాహనం

2 ఫిబ్రవరి 2020(ఆదివారం)     పల్లకీ ఉత్సవం                 అశ్వ వాహనం

3 ఫిబ్రవరి 2020(సోమ‌వారం)   చక్రస్నానం,                         ధ్వజావరోహణం

కాగా జ‌న‌వ‌రి 31వ తేదీ శుక్ర‌వారం ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీ మంగ‌ళ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

ఉత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment