Karthika Vanabhojanam in Tirumala Tirupati on 9 November 2025

The traditional practice of community dining during the auspicious Karthika month, the Karthika Vana Bhojanam will be conducted by TTD in Paruveta Mandapam near Gogarbham on November 9, 2025 in Tirumala.

As a part of this, on Sunday, Snapana Tirumanjanam will be performed to Utsava Murthies between 11am and 12noon followed by Karthika Vana Bhojanam.

In view of this event, TTD has cancelled Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahasra Deepalankara Sevas for the day.

TTD officials, religious staff and devotees participate in this unique event.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

నవంబరు 9 తిరుమలలో కార్తీక వన భోజనం

కార్తీక వన భోజన కార్యక్రమం నవంబరు 9వ తేది తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading