Bhagvad Gita, Vishnu Sahasranama Akhanda Parayana on Vaikunta Ekadashi in Tirumala… డిసెంబరు 23న తిరుమలలో భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయణం
డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతిని పురస్కరించుకొని తిరుమల నాదనీరాజనం వేదికపై సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుండి భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో 700 శ్లోకాలు నిరంతరాయంగా పారాయణం చేస్తారు. సాయంత్రం 6 గంటల నుండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు.
అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు, టీటీడీ వేదపండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఈ పారాయణ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.