Bhoga Srinivasamurty Sahasra Kalashabhishekam, 24 June 2026

The annual Special Sahasra Kalasabhishekam will be observed in Tirumala temple on June 24, 2026 in Tirumala temple.

Significance :

In commemoration of the special donation of the silver idol of Sri Bhoga Srinivasa murty by the famous Pallava Queen Samavai Perundevi several centuries ago, TTD performs Special Sahasra Kalasabhishekam to the utsava deities in Ekantham between 6 am to 8 am in the month of Jyesta.

Koutuka Beram:

The Bhoga Srinivasa Murthy is often considered as Koutuka Beram and is also known as Manavala Perumal.

This deity with four hands, a disc (chakra), and a conch (shankha), is a small 1.5ft tall idol which is believed to be the silver replica of the main deity in all aspects.

Daily Arjita Sevas as usual:

The daily rituals will follow after the completion of this special Sahara Kalasabhishekam as usual on that day.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 24 శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం

శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై కొన్ని వందల సంవత్సరాల మునుపు ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 24వ తేదిన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు.

శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆశీనులు చేస్తారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేస్తారు.

అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు ప్ర‌త్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభ‌వంగా నిర్వహించనున్నారు.

కాగా ఆ నాడు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading