The three day annual Jyeshtabhishekam, also known as Abhideyaka Abhishekam is held in Jyeshta month. It is held during Jyeshta nakshatra in Jyeshta maas at Tirumala Tirupati Sri Venkateswara swamy temple to Lord Balaji. In 2026, Jyeshtabhishekam begins on 26 June and ends on 28 June.
Every year, in the month of Jyeshta, the celestial Jyeshtabhishekam which is also known as Abhidyeyaka Abhishekam, is performed for three days concluding on the day of the advent of Jyeshta Nakshatra.
This ritual, which is performed in the Kalyana Mandapam of Sampangi Prakaram.
Significance:
This festival is usually observed to protect the ancient ceremonial idols of the deities from wear and tear due to the Abhishekams performed over generations.
Different Armours:
On the first day, the golden armour of Sri Malayappa Swamy is removed, and homas, abhishekams and Panchamrutha Snapana Tirumanjanam are performed.
After that, Sri Malayappa Swami is adorned with a diamond armour. On the second day, a pearl armour is decked. On the third day, the deity is adorned with the gold armour again.
Once in a year:
This gold armour is taken off again next year during the time of Jyeshtabhishekam only. Until then, utsava deity participates in various festivals in the gold armour throughout the year.
Sevas Cancelled:
In view of the Srivari Jyeshtabhishekam, TTD has cancelled the Arjita Sevas including Kalyanotsavam, Unjal Seva, and Arjita Brahmotsavam on June 28.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం
జూన్ 26 నుండి 28వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది.
ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.
సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.
ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఆర్జిత సేవలు రద్దు
కాగా జ్యేష్టాభిషేకాన్ని పురస్కరించుకుని జూన్ 28వ తేదిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
lord ttd annual seva jyestha abhishekam tirumala – jyestha purnima 2020