‘Bhavaya Namaha’

‘Bhavaya Namaha’ is the 697th name in Shiva Sahasranama (1000 Names of Lord Shiva). Here is the meaning and explanation of Bhavaya Namaha in Telugu..

శివ సహస్రనామములలో 697 వ నామం భవాయ నమః. భవతీతి భవః – అయినవాడు, కలిగినవాడు, ఉన్నవాడు అని మూడు అర్థములు. ఈ సర్వభూత కోట్లయందు ఉన్నటువంటివాడు, ఈ సర్వ జగద్రూపముగా అయినవాడు ఆయన. జగత్తు ఈశ్వరునికి భిన్నము కాదు. జగత్తు అంతా ఆయన స్వరూపమే.

ఇక పరతత్త్వ పరంగా చూస్తే సద్వస్తువు అని అర్థం. అంటే ఎప్పుడూ ఎవడు శాశ్వతమై ఉన్నవాడో, ఆ ఉన్నటువంటి వాడిని భవుడు అంటారు. శివునికి భవ అనే నామం ప్రత్యేకంగా ఉన్నది. అనగా యితడు శాశ్వతమై ఉన్నవాడు అని అర్థం. ఎప్పుడూ ఉండేవాడితడే. అదేవిధంగా సర్వజగత్తుగా కలిగిన వాడితడు. అంతా తానే అయినవాడు గనుక భవుడు ఇదొక అర్థం.

సర్వ భూతములకూ పోషకుడు, సర్వ భూతములకూ ఆధారమైన వాడు, సర్వ భూతములకూ ప్రభువు, సర్వ భూత కోట్లుగా అయిన వాడు అతడు.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading