Sri Bhootalayaya Namaha

‘Sri Bhootalayaya Namaha’ is the 690th name in Shiva Sahasranama (1000 Names of Lord Shiva). Here is the explanation of this name in Telugu…

శ్రీ భూతాలయాయ నమః

690వ నామం భూతాలయః. ఇది నమస్కారంలో భూతాలయాయ నమః అని చెప్పబడుతున్నది. భూతములకు ఆలయమైన వాడు. ఇక్కడ ఆలయం అనగా నివాసము, ఆధారము అని రెండు అర్థాలున్నాయి. పైగా సంపూర్ణమైన నివాసానికి ఆలయం అని పేరు.

భూతములన్నింటికీ సంపూర్ణమైన నివాసమైన వాడు. భూతములు పరమేశ్వరునే ఆధారం చేసుకొని ఉన్నాయి. అంతేకాని పరమేశ్వరుణ్ణి కొంత ఆధారం చేసుకొని, ఇంకొంత మరికొందరినో ఆధారం చేసుకున్నవి కావు. సంపూర్ణముగా పరమేశ్వరుడే సర్వభూతములకూ ఆధారమైన వాడు.

ఇక్కడ భూతములు అన్న మాటకి మనం గతంలో అనేక మార్లు చెప్పుకున్నట్లుగా ప్రాణికోట్లు అని అర్థం ఉన్నది. అదేవిధంగా పంచభూతాలు అని కూడా చెప్పబడుతున్నాయి. పంచ భూతాలూ మనకి ఆలయం అయితే పంచ భూతాలకూ ఆయన ఆలయమైన వాడు. అంటే మనం కూడా ఆయనని ఆలయంగా చేసుకున్నటువంటి వారమే. ఇలాగ సర్వ ప్రాణి కోట్లకు, పంచభూతాలకూ కూడా ఆధారమైనటువంటి వాడు కనుక భూతాలయః అని చెప్పబడుతూ ఉన్నాడు.

Write Your Comment