Sabhavanah – Meaning, Importance

‘Sabhavanah’ is the 689th name in Shiva Sahasranama (1000 Names of Lord Shiva). ‘Om Sabhavanaya Namaha’ is the full name mentioned in Sahasranama. Meaning of this name is given here in Telugu…

శివ సహస్రనామములలో 689వ నామం సభావనః.

ఇది నమస్కారంలో సభావనాయ నమః అని చెప్పబడుతున్నది. ఇది ఒక విశిష్టమైన నామం. సభను రక్షించు వాడు. అవనము అంటే రక్షణ అని అర్థం. సభ+అవనః=సభావనః. సభను రక్షించువాడు. అవతీతి అవనః”. ఇక్కడ సభను రక్షించు వాడు అంటే సభారూపమైన వ్యవస్థని చక్కగా తీర్చిదిద్దువాడు అని అర్థం. “నమస్సభా భ్యస్సభాపతి భ్యశ్చ వో నమః నమః” అని రుద్ర మంత్రాలలో చెప్పబడుతున్నది. సభల రూపంలో ఉన్నవాడు, సభాపతుల రూపంలో ఉన్నవాడు అయిన పరమేశ్వరునికి నమస్కారం అన్నారు. ఇది నటరాజ స్వామి పరంగా చెప్పబడుతున్న దివ్యనామం.

సభావన అనే తత్త్వం వివిధ శాస్త్రములలో వివిధ విధములుగా చెప్పబడుతున్నది. ముఖ్యంగా పరమేశ్వరునికి సభాపతి, సదసస్పతి, అనే నామాలున్నాయి. చిదంబరంలో పరమేశ్వరుని సభాపతి అని అంటారు. అందుకే తమిళనాడులో అనేక మందికి సభాపతి అనే పేరు కూడా ఉన్నది. సభలకి పతియైనటువంటి వాడు. పతిగా సభలను రక్షిస్తాడు గనుక సభాపతియైన పరమేశ్వరుడిని సభావనః అన్నారు.

యజ్ఞ వేదికలయందు సమావేశమైనట్టి విశేషములను సభలు అంటారు. వాటిని రక్షించువాడు యజ్ఞేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు అని ఇంకొక అర్థాన్ని చెప్పుకున్నాం. యజ్ఞములయందు ఉండేవాటికి సభలు అనే వేదములయందు ప్రసిద్దిగా కనపడుతున్నది. పైగా యజ్ఞంలో బహు శాస్త్రములను ప్రయోగించుతారు. ఆ బహు శాస్త్రవేత్తలు అక్కడికి రావాలి. ఆ విధంగా బహు శాస్త్రములు తెలిసి యజ్ఞములో కూర్చోవడానికి ఎవరు అర్హులో వారిని సభ్యులు అని అంటారు. ఆ సభ్యులున్న చోటు సభ. అలాంటి దివ్యమైన సభలలో శాస్త్రాది జ్ఞాన రూపములో ఉన్నటువంటి వాడు అతడే. అందుకు ఇక్కడ జ్ఞానమయమైనటువంటి యజ్ఞమయమైన సభలను రక్షించే సభాపతి యజ్ఞేశ్వరుడు అనే మూడవ అర్థాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు.

జ్ఞాన సమూహముతో కూడినటువంటి సర్వ శాస్త్రవేత్తలు ఎక్కడుంటారో అది సభ అని అలాంటి సభలను రక్షించే జ్ఞాన స్వరూపుడు సభావనః అని చెప్పబడుతున్నాడు.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading