Sri Sita Devi Jayanthi Mahotsavam will be celebrated with grandeur on April 25, 2026 at Sri Kodandarama Swamy vari Temple in Vontimitta, Kadapa district. On this auspicious occasion, the temple will be filled with a spiritually vibrant and devotional atmosphere.
On the same day (Saturday), several Vedic rituals will be conducted in accordance with sacred traditions from 5:30 PM to 7:30 PM. The program will commence with temple pradakshina, followed by Bhagavat Anugna, Vishvaksena Aradhana, and Vasudeva Punyahavachanam. Later special puja will be offered to the Lord, along with Vasanthika Puja and Sahasranamarchana to the Goddess with great devotion and reverence.
This will be followed by Nivedana, Maha Mangala Harati, Veda Swasti, and Sattumora rituals performed in a grand manner.
TTD appeals to devotees to participate in large numbers on this auspicious day and seek the divine blessings and grace of Sri Sita Devi.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 25న ఒంటిమిట్టలో శ్రీ సీతమ్మవారి జయంతి మహోత్సవం
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 25వ తేదీన శ్రీ సీతమ్మవారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయం భక్తి పరవశంతో నిండిపోనుంది.
ఈ సందర్భంగా 25వ తేదీ శనివారం సాయంత్రం 5.30 గంటల నుండి 7.30 గంటల వరకు పలు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ఆలయ ప్రదక్షిణతో ప్రారంభమై, భగవత్ అనుగ్ఞ, విష్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి విశేష ఆరాధన, అమ్మవారికి వసంతిక పూజ, సహస్రనామార్చన భక్తిశ్రద్ధలతో సాగుతాయి.
తదనంతరం నివేదన, మహా మంగళహారతి, వేదస్వస్తి, సాత్తుమొర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ పుణ్యదినాన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతమ్మవారి అనుగ్రహం, కృపాకటాక్షాలను పొందాలని టిటిడి ఆకాంక్షిస్తోంది.