Vontimitta Hanuman blesses devotees as Sanjeeva Raya | Anjaneya Swamy Temple in Vontimitta

vontimitta hanuman temple

vontimitta hanuman temple

Vontimitta Hanuman blesses devotees as Sanjeeva Raya | Anjaneya Swamy Temple in Vontimitta… Anjaneya as Sri Sanjeeva Raya has been blessing devotees at Vontimitta in YSR Kadapa district.

Usually, the idol of Hanuman stays alongside Sri Rama in the sanctum of every temple dedicated to Lord Rama. But the unique feature is, the Sanjeeva Raya temple is located opposite Vontimitta Kodanda Ramalayam.

The legends says that when the presiding deity of Sri Kodandarama flanked by Sita Devi and Lakshmana Swamy originated at Vontimitta, they were in exile and not yet met Hanuman. So Anjaneya is not present in the sanctum.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంజీవని తెచ్చిన సంజీవరాయడు

ఒంటిమిట్టలోని శ్రీ ఆంజనేయస్వామివారు సంజీవరాయడుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సంజీవరాయని ఆలయ పురాణ ప్రాశస్త్యం ఇలా ఉంది.

ఒంటిమిట్ట గుడిలో సీతాలక్ష్మణులు ఇరువైపులా ఉండగా కోదండం ధరించి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు. ఇది అరణ్యవాస కాలం నాటి దృశ్యం. అప్పటికి ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం హనుమంతునికి కాలేదు. ఆ కారణం చేతనే ఒంటిమిట్ట గుడిలో ఆంజనేయస్వామి లేడంటారు. రామాలయం అంటే భూమికి దిగిన వైకుంఠమని, రాముని బంటును కావున ఎదురుగా ఉండి సేవ చేసుకుంటానని ఆంజనేయస్వామి చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఒంటిమిట్ట గుడికి ఎదురుగా సంజీవరాయడుగా కొలువుదీరి ఉన్నాడు. రామరావణ యుద్ధంలో వానరులు మరణించినపుడు, లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రెండుసార్లు హిమాలయ పర్వతాలు దాటి మహేంద్రగిరికి వెళ్లి నాలుగు రకాల సంజీవని మూలికలను ఆంజనేయుడు తెచ్చినట్టు పురాణ కథనం. కావున ఇక్కడి స్వామివారికి సంజీవరాయడని పేరు వచ్చింది.

చెరువు కట్ట మీద కూడా ఆంజనేయస్వామివారు కొలువై ఉన్నారు. నీటి వల్లగానీ, వరిపొలాల్లో తిరుగుతున్నపుడు గానీ, ఈ బాటలో యాత్ర చేస్తున్నప్పుడు గానీ ప్రాణభయం కలగకుండా ఈ ఆంజనేయస్వామి కాపాడతారని భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామివారు శారీరక మానసిక రోగాలు పోగొడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Write Your Comment