Vasanta Panchami in Nellore AC Subba Reddy Stadium by TTD

In connection with the mantram Maghamasam festivities, Vasanta Panchami Saraswati Puja will be observed in Sri Potti Sriramulu Nellore district by TTD on February 16, 2021 under the aegis of SV Vedic University.

This fete will be observed in AC Subba Reddy Stadium between 6pm and 8:30pm.

This event is mulled by TTD as part of its Sanatana Hindu Dharma activity and to revive the ancient forgotten traditions mentioned in scriptures.

With the benign blessings of Goddess Saraswathi-the chief deity of knowledge and wisdom, by doing this pooja the students will prosper in their career.

SVBC is telecasting the programme live for the sake of global devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 16న నెల్లూరులో వసంత పంచమి

తిరుపతి, 2021 ఫిబ్రవరి 14: టిటిడి నిర్వహిస్తున్న మాఘ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 16న నెల్లూరులోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో వసంత పంచమి మహోత్సవం జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ పండితులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

నేటితరం మరిచిపోతున్న ధార్మిక విలువలను, సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసేందుకు ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని టిటిడి నిర్వహిస్తోంది. శ్రీ సరస్వతీ దేవిని విద్యాధిదేవతగా గుర్తించిన రోజును వసంత పంచమి అంటారు. శ్రీ సరస్వతీ దేవి అనుగ్రహం వల్లనే  సకల విద్యలు అలవడతాయి. ఇందులో విద్యాసంపద, శాస్త్ర సంపద తదితరాలున్నాయి. ఈ అమ్మవారి అనుగ్రహం కోసం చేసే పూజను శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు. విద్యార్థులందరికీ మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని సరస్వతి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.  

Write Your Comment