Tumburu Teertham Mukkoti at Tirumala was celebrated on 6 April 2023.
Tumburu Teertham mukkoti will be observed with religious pomp and gaiety in Tirumala on 6 April 2023 with hundreds of devotees trekking the steep hills of Seshachala to reach the holy waterfalls located in the thick green forests in Tirumala.
The devotees will be allowed for Tumburu Theertham from 6am onwards till 5pm on April 5 and again 5am to 12noon on April 6. Those who have obesity, cardiac problems, other chronic diseases are appealed not to trek the path keeping in view their health safety and security.
Among the 66 crore holy water falls located in the green belt of Seshachalam Ranges which also houses the world famous hill shrine of Lord Venkateswara, seven are considered to be most sacred which includes Swamy Pushkarini,Tumburu Teertham, Chakra Teertham,
Gogarbham, Papavinasanam, Akasa Ganga and Ramakrishna Teertham.
This mukkoti usually observed on full moon day usually in the months of March-April combined with the star Uttara Phalguni which is considered to be very auspicious. This theertham is named after Saint Tumburu who did penance here in these caves.
About 600 odd Srivari sevakulu have been deployed on April 2023 itself for Anna Prasad am, health, medical departments. They offer services in two shifts to facilitate the devotees to the holy theertham.
The TTD Anna prasadam wing has distributed packets of Upma, Pulihora, sambar rice, Pongal, curd rice and Tomato rice from Tuesday morning with the assistance of volunteers.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసివున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 6న జరుగనుంది.
పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం.
తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 5, 6వ తేదీల్లో ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి ఏప్రిల్ 5న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందిస్తారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.
తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.
భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.
పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.