TTD’s Saare to Tataiah Gunta Gangamma Temple

TTD EO Sri Anil Kumar Singhal presented sare to Gangamma, the folk goddess of Tataiahgunta in the temple city on Saturday, 11 May 2019.

It is often believe that Gangamma is the beloved sister of Tirumala Lord Venkateswara. Every year He sends the sare to His sister which will be adorned to the Goddess on the auspicious day of Gangamma Jatara which falls on May 14.

The sare was rendered special puja in Sri Govindaraja Swamy temple and the EO handed over the traditional sare to State Endowments Regional Commissioner Smt Bhramaramba.

Sri Govindaraja Swamy temple Spl.Gr.Dy.E.O Smt Varalakshmi was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుప‌తి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టిటిడి సారె

తిరుపతి, 11 మే 2019; తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సారె సమర్పించారు. మే 7వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 14వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ రిజిన‌ల్ క‌మీష‌న‌ర్ శ్రీ‌మ‌తి భ్ర‌మ‌రాంబ‌కు టిటిడి ఈవో అందజేశారు. అక్కడి నుంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా సారెను గంగమ్మ ఆలయానికి తీసుకెళ్లారు.

తిరుప‌తి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారు. ప్రతి ఏటా చైత్ర మాసంలో జాతర సందర్భంగా నాలుగో రోజున అమ్మవారికి టిటిడి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించేలా అపురూపంగా జాతర జరుగుతుంది.ఈ సందర్భంగా భక్తులు బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి, సున్నపుకుండలు, పేరంటాలు తదితర వేషాలను ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, శ్రీవారి ఆల‌య షేష్కార్ శ్రీ లోక‌నాథం, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కృష్ణ‌మూర్తి, గంగమ్మ ఆలయ పాలకమండలి అధ్యక్షులు శ్రీఆర్‌సి.మునికృష్ణ, ఆల‌య ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment