Pushpayagam on 15 March 2026 at Srinivasa Mangapuram Kalyana Venkateshwara Swamy Temple

Pushpayagam on 15 March 2026 at Srinivasa Mangapuram Kalyana Venkateshwara Swamy Temple.. TTD will conduct the annual Pushpayagam at the Sri Kalyana Venkateswara Swamy Temple on March 15 in a traditional manner.

As part of the rituals, Senadhipati Utsavam and Ankurarpanam will be observed on March 14 from 6:00 PM to 8:00 PM.

It may be recalled that the Annual Brahmotsavams were held in the temple from February 8 to 16. Pushpayagam is performed as a ritual of expiation for any known or unknown lapses that might have occurred during the Brahmotsavams by priests, officials, staff or devotees. It is believed that the performance of this sacred ritual absolves all such doshas.

On March 15, Snapana Tirumanjanam will be conducted to the Utsava deities of Sri Kalyana Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi from 10:00 AM to 11:00 AM. The deities will be offered Abhishekam with milk, curd, honey, turmeric, sandalwood paste and coconut water.

Pushpayagam will be performed from 2:00 PM to 4:00 PM with offerings of various flowers including Tulasi, Chrysanthemum, Oleander, Jasmine, Sampangi, Rose and Lotus.

Later, from 5:30 PM to 6:30 PM, the deities will bless devotees by taking out a procession along the four Mada Streets of the temple.

Tickets will be available at the temple from March 14 onwards. Gruhasthas (two persons) can participate in the Pushpayagam by purchasing a ticket at Rs. 516.

In view of Pushpayagam, the Nitya Kalyanotsavam Seva stands cancelled on March 15.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 15 శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగ మహోత్సవం 

–    మార్చి 14 అంకురార్పణ  

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 15న తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది.

ఇందుకోసం మార్చి 14వ తేదీ సాయంత్రం 6 గం.ల నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

ఇందులో భాగంగా మార్చి 15న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంత‌రం సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చిపై స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హంచ‌నున్నారు.

మార్చి 14వ తేదీ నుండి శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల‌కు టికెట్లు  అందుబాటులో ఉంటాయి.  గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు. పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 15న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading