Teppotsavams will be conducted in a grand manner at the Sri Kapileswara Swamy Temple, Tirupati, from 29 December 2025 to 2 January 2026.
During the five-day Teppotsavam celebrations, on the first day, December 29, Sri Vinayaka Swamy and Sri Chandrasekhara Swamy will take nine rounds on the sacred waters of the temple pushkarini.
On 30 December 2025, Sri Subramanya Swamy along with Valli and Devasena will take nine rounds.
On 31 December 2025, Sri Somaskanda Swamy will take nine rounds.
On 1 January 2026, Sri Kamakshi Ammavaru will take nine rounds.
On 2 January 2026, Sri Chandikeswara Swamy and Sri Chandrasekhara Swamy will take nine rounds on the float and bless the devotees.
Every day, Unjala Seva and Teppotsavams will be held from 6.00 pm to 8.00 pm.
On January 3, on the occasion of the Arudra Darshana Mahotsavam, the Utsava idols of Sri Nataraja Swamy, Sri Sivagami Ammavaru and Sri Manikyavasagar Swamy will be taken in a procession along the mada streets from 6 am to 9 pm.
As part of the Teppotsavam celebrations, devotional songs will be rendered every day under the auspices of the TTD Annamacharya Project.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 29 నుండి జనవరి 2వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 29 నుండి జనవరి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన డిసెంబరు 29వ తేదీన శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్రశేఖర్ స్వామివారు పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారు. నవంబరు 30న శ్రీ వళ్ళి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారు 9 చుట్లు, డిసెంబరు 31న శ్రీ సోమస్కందస్వామివారు 9 చుట్లు, జనవరి 1న శ్రీ కామాక్షి అమ్మవారు 9 చుట్లు, జనవరి 2న శ్రీ చండికేశ్వరస్వామివారు మరియు శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఊంజల సేవ, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
జనవరి 3వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.