TTD Joint Executive Officer Sri P Basant Kumar on Tuesday released wall posters of Sri Devi Navaratri festival relates to Sri Kapileswara temple in Tirupati.
Speaking later at his chambers in TTD administrative building, the JEO highlighted the events of the Navaratri fete which commences with Kalasha Sthapana on September 29 and concludes with Kalashabhisekam on October 8 followed by Paruveta Utsavam.
Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi, Temple Inspector Sri Reddy Sekhar and others participated.
List of Alankarams & Navaratri scheule for 2019 Devi Navaratri
29 September 2019 – Kalasha Sthapana
30 September 2019 – Kamakshi Devi Avataram
1 October 2019 – Adi Parashakti Avataram
2 October 2019 – Annapurna Devi Avataram
3 October 2019 – Mavadi Seva
4 October 2019 – Lakshmi Devi Avataram
5 October 2019 – Durga Devi Avataram
6 October 2019 – Saraswati Avataram
7 October 2019 – Mahishasuramardhini Avataram
8 October 2019 – Shiva Parvatula Avataram
8 October 2019 – Kalashabhishekam
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో దేవీనవరాత్రి ఉత్సవాల గోడపత్రికలు అవిష్కరణ
సెప్టెంబర్ 17, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీ దేవీనవరాత్రి ఉత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ దేవీనవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 29న కలశస్థాపనతో ప్రారంభమై, అక్టోబరు 8న కలశాభిషేకం, పార్వేటి ఉత్సవంతో ముగుస్తాయని తెలిపారు. సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 7వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం జరుగుతుందని, సాయంత్రం ఊంజల్‌సేవలో శ్రీకామాక్షి అమ్మవారు ప్రత్యేక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. సెప్టెంబరు 30న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 1న ఆదిపరాశక్తి, అక్టోబరు 2న శ్రీ అన్నపూర్ణాదేవి, అక్టోబరు 3న మావడి సేవ, అక్టోబరు 4న శ్రీ లక్ష్మీదేవి, అక్టోబరు 5న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 6న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 7న శ్రీ మహిషాసురమర్థిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు. అక్టోబరు 8న విజయదశమినాడు శ్రీ శివపార్వతులు దర్శనమిస్తారని, అదేరోజు పార్వేట ఉత్సవం జరుగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.