Lyrics of Jaya Mangalam Nitya Shubha Mangalam, Ambaa Mangalam Aadishakti Ki Mangalam… Devi Harathi song in Telugu…
జయ మంగళం నిత్య శుభ మంగళం
అంబా మంగళం ఆదిశక్తికి మంగళం ||
జయ మంగళం నిత్య శుభ మంగళం
అంబా మంగళం ఆదిశక్తికి మంగళం ||
కనకదుర్గా దేవికి కర్పూర మంగళం
కరుణాలవాలకి కల్యాణ మంగళం
మహిషాసురమర్దినికి మహిత మంగళం
శ్రీ లలితా పరమేశ్వరికి దివ్య మంగళం ||
జయ మంగళం నిత్య శుభ మంగళం
అంబా మంగళం ఆదిశక్తికి మంగళం ||
ముల్లోకముల నేలు ముక్కంటి రాణికి
మురిపాల చిరునవ్వుల ముద్దులతల్లికి
భక్తజన రక్షకి భవరోగ హారిణికి
శ్రీచక్ర నివాసినికి జయజయ మంగళం ||
జయ మంగళం నిత్య శుభ మంగళం
అంబా మంగళం ఆదిశక్తికి మంగళం ||
రత్నకిరీటధారిణికి రజిత మంగళం
పచ్చతోరణాల లోగిళ్ళ మంగళం
మంగళప్రదమైన మా తల్లి గౌరికి
అంగరంగ వైభోగాల ఆరతి మంగళం ||
జయ మంగళం నిత్య శుభ మంగళం
అంబా మంగళం ఆదిశక్తికి మంగళం ||
జయ మంగళం నిత్య శుభ మంగళం
అంబా మంగళం ఆదిశక్తికి మంగళం ||
మంగళం గౌరీదేవికి మంగళం
మంగళం కామాక్షి దేవికి మంగళం
మందార దామాల సుందర వదనకి
కుందరదనలాలిత కోమలాంగికి మంగళం
కనకాంబరధారిణికి కరుణాంతరంగికి
శ్రీరాజరాజేశ్వరికి శుభ మంగళం ||
జయ మంగళం నిత్య శుభ మంగళం
అంబా మంగళం ఆదిశక్తికి మంగళం ||