Tirumala Bhu Varaha Swamy Temple’s Astabandhana Balalaya Mahasamproksham

TTD plans to perform the Astabandhana Balalaya Mahasamproksham, a holy Vaikhanasa Agama ritual in all Vaishnava temples at the Sri Bhu Varaha Swamy temple in Tirumala from April 23- 27 with Ankurarpanam on April 22, 2019.

According to legends Sri Varahaswami is given priority by pilgrims for first darshan ahead of Lord Venkateswara. The famed ritual is performed to rejuvenate the divine charm and the linking of the idols with the Padmapeetham in the sanctum sanctorum.

On April 23, Kalakarshana, April 24 and 25 Visesha Homams, April 26 Maha shanti Purnahuti and on April 27 Maha Samprokshanam will be performed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 23 నుండి 27వ తేదీ వరకు తిరుమ‌ల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ

తిరుమల, 2019 మార్చి 27: తిరుమలలోని శ్రీ భూ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 23 నుండి 27వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ జరుగనుంది. వైఖానస ఆగమాన్ని పాటించే అన్ని వైష్ణవాలయాల్లో లోకసంక్షేమం కోసం ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఏప్రిల్ 22వ తేదీ రాత్రి అంకురార్పణం జరుగనుంది.

దైనందిన మహాసంప్రోక్షణ కార్యక్రమ వివరాలు :

ఏప్రిల్ 22న అంకురార్పణ :

– ఏప్రిల్ 22వ తేదీ సోమ‌వారం రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. వసంతమండపం వద్ద పుట్టమన్ను సేకరించి రాత్రి 9.30 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం చేపడతారు.

ఏప్రిల్ 23న :

– ఏప్రిల్ 23న ఉదయం 7.00 నుండి 10.00 గంటల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. రాత్రి 8.00 నుండి 10.00 గంటల వ‌ర‌కు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు.

ఏప్రిల్ 24, 25వ తేదీల్లో :

– ఏప్రిల్ 24, 25వ తేదీల‌లో ఉద‌యం 8.00 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు, మ‌ర‌ల రాత్రి 8.00 నుండి 10.00 గంట‌ల వ‌ర‌కు విశేషహోమాలు, యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఏప్రిల్ 26న :

– ఏప్రిల్ 26న ఉద‌యం 9.00 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారికి మ‌హాశాంతి పూర్ణాహుతి, తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. రాత్రి 8.00 నుండి 10.00 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాల‌లో భాగంగా శ‌య‌నాధివాసం జ‌రుగ‌నున్నాయి.

ఏప్రిల్ 27న :

– ఏప్రిల్ 27న ఉదయం 10.00 నుండి 11.00 గంటలలోపు మహాపూర్ణాహుతి, మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.
అనంతరం రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

క్షేత్ర ప్రాశ‌స్త్యం :

వేంకటాచలక్షేత్రంలోని తొలిదైవం శ్రీ ఆదివరాహస్వామి. ఈయన్నే ‘శ్వేత వరాహస్వామి’ అంటారు. క్షేత్రసంప్రదాయం ప్రకారం ‘తొలిపూజ, తొలి నైవేద్యం, తొలిదర్శనం’ జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వరుని దర్శించడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

అష్టబంధన బాలాల‌య మహాసంప్రోక్షణ :

సాధారణంగా ఆలయంలో కొలువైన మూలవిరాట్టులు, పరివార దేవతల విగ్రహాల పాదాల కింద ఉన్న పద్మపీఠానికి మధ్యలో అష్టబంధన లేపనము పూసి అతికించబడి ఉంటాయి. ఇందువల్ల విగ్రహాలు కదలకుండా ఉంటాయి. ఆలయ సన్నిధిలో ప్రతిరోజూ జరిగే కైంకర్యాలు, అభిషేకాలు, ధూపదీపాల వల్ల వచ్చే వేడి మొదలైన వాటివల్ల కాలక్రమంలో అష్టబంధనము ఊడి విగ్రహాలు కదులుతాయి. ఇందులో భాగంగా గ‌ర్భాల‌యాలలో జీర్ణోద్ధరణ (ఆధునీకరణ పనులు) కోసం ”బాలాలయం” చేపడతారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment