Annamayya Audio CDs – ‘Sri Annamayya Dasavathara Leela’, ‘Sri Annamayya Bhakthi Dhamam’ launched

Annamayya Audio CDs – ‘Sri Annamayya Dasavathara Leela’, ‘Sri Annamayya Bhakthi Dhamam’ launched… The launch of audio CD, Sri Annamayya Dasavathara Leela sung by Sri. P.R.Ramanathan and another CD Sri Annamayya Bhakthi Dhamam by Sri. B. Raghunath was released on Saturday evening (27 April 2019) on the eve of Sravana Nakshatram.

The CD release event took place at Annamachaya Kalamandiram in Tirupati.
Later the singers presented a few songs from the respective CDs which enthralled the music lovers.

SV Recording project special officer Sri P Munirathnam Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

”అన్నమయ్య దశావతార లీల”, ”అన్నమయ్య భక్తి ధామం” సంకీర్తనల సిడి ఆవిష్కరణ

తిరుపతి, 2019 ఏప్రిల్‌ 27: శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య దశావతార లీల”, ”అన్నమయ్య భక్తి ధామం” సంకీర్తనల సిడిని ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు.”అన్నమయ్య దశావతార లీల” సంకీర్తనలను శ్రీ పి.ఆర్‌.రామనాథన్‌ స్వరపరచగా, ”అన్నమయ్య భక్తి ధామం” సంకీర్తనలను శ్రీ బి.రఘునాథ్‌్‌ స్వరపరచారు. ఈ సంకీర్తనలను శ్రీ శరత్‌ సంతోష్‌, శ్రీనిధి, రమణ వాణి గానం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ పి.ఆర్‌.రామనాథన్‌, శ్రీ బి.రఘునాథ్‌్‌, శ్రీ శరత్‌ సంతోష్‌, శ్రీనిధి, రమణ వాణిలను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వారు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, విశేష సంఖ్యలో భక్తలు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment