Vontimitta Sri Ramanavami Brahmotsavams 2nd Day – Venugana Alankaram

Vontimitta Brahmotsavam 2nd day morning 1

Vontimitta Brahmotsavam 2nd day morning 1

Vontimitta Sri Ramanavami Brahmotsavams 2nd Day – Venugana Alankaram on 1 April 2023. Sri Rama in Venuganalankaram blessed devotees on the second day morning as part of ongoing annual brahmotsavams at Vontimitta Kodanda Ramalayam on Saturday.

Deputy EO Sri Natesh Babu, Manuscripts special officer Smt Vijayalakshmi, AEO Sri Gopal Rao and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి చిద్విలాసం

ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 01: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు.ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు

సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, ఏఈఓ శ్రీ గోపాలరావు, సూపరింటెండెంట్లు శ్రీ పి.వెంకటేశయ్య, శ్రీ ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading