TTD ‘Gudiko Gomata’ in Kakinada Balatripurasundari Temple

TTD is planning for Gudiko Gomata program in Kakinada on 12 December 2020, Saturday. At 10 AM, the Chairman of TTD will present a cow and a calf to Sri Balatripurasundari Temple, Kakinada.

డిసెంబర్ 12న కాకినాడలో గుడికో గోమాత ప్రారంభం

–   శ్రీ బాల త్రిపురసుందరి ఆలయంలో ప్రారంభిచనున్న టీటీడీ చైర్మన్  శ్రీ వైవి సుబ్బారెడ్డి

డిసెంబరు 12వ తేదీ (రేపు) శనివారం తూర్పుగోదావరి జిల్లాలో గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయానికి ఆవు , దూడను ఆయన అందిస్తారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

సనాతన హిందూధర్మ  పరిరక్షణలో భాగంగా  గోసంరక్ష కోసం గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించాలని ధర్మ కర్తల మండలి తీర్మానించిన విషయం తెలిసిందే.   ఇందులో భాగంగా డిసెంబరు 7వ తేదీ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో, 10వ తేదీ తెలంగాణ కు సంబంధించి హైదరాబాద్ లో టీటీడీ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading