Thyagaraja Swamy Jayanti in Tirumala – 10 May 2019

Saint musician Sri Tyagaraja Swamy 252nd Jayanthi will be observed in Tirumala in a big way on Friday, 10 May 2019.

Renowned Carnatic artistes from across the southern states render the popular notes Tyagaraja Swamy from 6pm onwards at Kalyana Vedika in the presence of processional deities.

TTD has been organising Vaggeyakara Utsavams from the past six years in a big way in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీత్యాగరాజస్వామివారి జయంతి ఉత్స‌వాలకు ఏర్పాట్లు పూర్తి

టిటిడి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 10వ తేదీన తిరుమలలో శ్రీత్యాగరాజస్వామివారి 252వ జయంతి ఉత్స‌వాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ధర్మప్రచారంలో భాగంగా ప్రముఖ వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఏడేళ్లుగా తిరుమలలో త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

తిరుమలలోని పాపవినాశనం రోడ్డులో గల కల్యాణ వేదికపై సాయంత్రం 6.00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలను ఆలపిస్తారు. ప్రముఖ సంగీత విద్వాంసులతో పాటు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, కళాకారులు, భజన బృందాల సభ్యులు పాల్గొంటారు.

కాక‌ర్ల‌లో శ్రీ‌నివాస క‌ల్యాణం…

శ్రీ త్యాగయ్య జన్మస్థలమైన ప్రకాశం జిల్లా కాకర్లలోనూ మే 10న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ధ్యాన మందిరం వద్ద సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు మంగళధ్వనితో శ్రీ త్యాగరాజస్వామివారి జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు ప్రముఖ సంగీత విద్వాంసులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులతో శ్రీత్యాగరాజస్వామివారి ఘ‌న‌రాగ పంచరత్న కీర్తనలు ఆలపిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీనివాస‌ కల్యాణం వైభవంగా జరగనుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading