New Delhi TTD Temple Brahmotsavams 2026

The annual Brahmotsavams of Sri Venkateswara Swamy will be celebrated with grandeur at the Sri Venkateswara Swamy Temple in New Delhi from May 01 to 09, 2026. The Ankurarpanam ritual will be performed on April 30.

As part of the pre-festival rituals, Koil Alwar Thirumanjanam (temple cleansing ceremony) will be conducted on April 28. Dwajarohanam (flag hoisting) will take place on May 01 between 9:00 PM and 10:30 PM during the auspicious Mithuna Lagnam.

During the Brahmotsavams, Vahana Sevas will be held daily from 8:00 AM to 9:00 AM and from 7:30 PM to 8:30 PM. Pushpayagam will be performed on May 10 from 6:00 PM to 8:00 PM.

Vahana Seva Schedule:

• 01 May 2026 – Morning: Dwajarohanam; Night: Pedda Sesha Vahanam

• 02 May 2026 – Morning: Chinna Sesha Vahanam; Night: Hamsa Vahanam

• 03 May 2026 – Morning: Simha Vahanam; Night: Muthyapu Pandiri Vahanam

• 04 May 2026 – Morning: Kalpavriksha Vahanam; Night: Sarvabhoopala Vahanam

• 05 May 2026 – Morning: Mohini Avataram; Evening: Kalyanotsavam; Night: Garuda Vahanam

• 06 May 2026 – Morning: Hanumantha Vahanam; Night: Gaja Vahanam

• 07 May 2026 – Morning: Surya Prabha Vahanam; Night: Chandra Prabha Vahanam

• 08 May 2026 – Morning: Rathotsavam; Night: Aswa Vahanam

• 09 May 2026 – Morning: Chakrasnanam; Night: Dwajavarohanam

Devotees are requested to participate in these divine Brahmotsavams and seek the blessings of the Lord.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI     

మే 01 నుండి 09 వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

భక్తిరసముతో విరాజిల్లనున్న దివ్య ఉత్సవాలు 

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 01 నుండి 09వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఏప్రిల్ 30నఅంకురార్పణం జరుగనుంది.

బ్రహ్మోత్సవాల ముందు భాగంగా ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 01వ తేదీ రాత్రి 09.00 గంటల నుండి 10.30 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణంనిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 10వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటలవరకు పుష్పయాగం నిర్వహించబడుతుంది.

వాహన సేవల వివరాలు 

 01 May 2026 – ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం

 02 May 2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం

 03 May 2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం

 04 May 2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం

05 May 2026 – ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహనం

 06 May 2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం

 07 May 2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

 08 May 2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం

 09 May 2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం

ఈ దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపను పొందాలని భక్తులను కోరుతున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading