Devuni Kadapa Temple Teppotsavams 2026

The Teppotsavams (float festival) of Sri Lakshmi Venkateswara Swamy Temple at Devuni Kadapa in Kadapa district will be held grandly from April 29 to May 1, 2026.

On this occasion, the Lord and Goddess will bless devotees by taking a ride on the temple pushkarini on a float every day at 6:00 PM.

Festival Details:

April 29 – Sri Krishna along with Goda Devi – 3 rounds

April 30 – Sri Venkateswara Swamy with Sridevi and Bhudevi – 5 rounds

May 1 – Sri Venkateswara Swamy with Sridevi and Bhudevi – 7 rounds

During these three days, Snapana Tirumanjanam will be performed daily from 10:00 AM to 11:00 AM, and Tiruveedhi Utsavam will be held from 5:30 PM to 6:00 PM.

On this occasion, spiritual and cultural programs will be organized under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya Project.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు దేవుని కడపలో తెప్పోత్సవాలు

కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవారు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఉత్సవాల వివరాలు:

ఏప్రిల్ 29 – శ్రీ కృష్ణ సమేత గోదాదేవి 3 చుట్లు

ఏప్రిల్ 30 – శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు 5 చుట్లు

మే 1 – శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు 7 చుట్లు

ఈ మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

అదేవిధంగా, టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading