Srivari Saare to Padmavathi for Ammavari Brahmotsavams (Tiruchanur)

Tiruchanur Padmavathi Ammavaru

Tiruchanur Padmavathi Ammavaru

Srivari Saare to Padmavathi for Ammavari Brahmotsavams (Tiruchanur) on 25 November 2025… Following the auspicious Panchami Theertham, the procession of Tiruchanoor Sare from Tirumala commences from Tirumala temple during the early hours on Tuesday, 25 November 2025.

The sare happens to the precious gift from Sri Venkateswara Swamy to His lady love Sri Padmavati on the laters’ birthday which happens to be the Tiruchanoor Panchami.

The pre-dawn rituals commences with the procession of Parimalam, tulasi Garlands and other valuable ornaments to be presented to Sri Padmavathi from Her better half.

This sare will be carried on the temple elephants circumambulating four mada streets and then taking to Tiruchanoor.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

నవంబర్ 25 శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన నవంబర్ 25వ తేదీ మంగళవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను పంప‌నున్నారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సంద‌ర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టి, శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలవుతుంది.

ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ‌తారు. అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద అమ్మ‌వారికి సారె సమర్పించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading