Ammavaru as ‘Gandharva Sapa Vimochana Krishna’

After musing the devotees as Ahalya Sapa Vimochana Rama on Kalpavriksha vahana, the Goddess on sixth day morning amazed devotees as “Gandhava Sapa Vimochana Krishna” on Sunday on Sarvabhupala vahanam.

According to this new theme, it portrays the famous episode from Sri Krishna Avatar where little krishna pushes two huge trees with his tiny hands when the towing where he was tied gets stucked in between these two trees. Only the sages understood the mystery of the two fallen trees as they realised that the two trees are nothing but two young Gandharvas who had been rude to Sage Narada were cursed by him to be born as two trees and spend a hundred years as silent witnesses to human follies. They could only be freed from the curse by Lord Krishna.

Sarva Bhupala Vahanam implies that Lord is the supreme commander of the entire universe and the same was portrayed by Goddess Padmavathi Devi.

TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సర్వభూపాల వాహనంపై గాన గంధ‌ర్వ శాప విమోచ‌న శ్రీ కృష్ణుని అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి, 2018 డిసెంబరు 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై గాన గంధ‌ర్వ శాప విమోచ‌న శ్రీ కృష్ణుని అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝ‌న్సీరాణి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading