Significant Growth in TTD offerings – Gold offerings, hundi collections.. DONATIONS, SRIVARI HUNDI AND GOLD OFFERINGS SHOWS SIGNIFICANT GROWTH.
The current financial year has been very exciting, as the gold, silver, donations and Srivari Hundi offerings recorded significant growth in Tirumala than the previous years, said TTD EO Sri Anil Kumar Singhal.
Speaking to media after the monthly Dial your EO programme, the EO said, when the donations for TTD Trusts and Scheme stood at Rs.91.91crores during 2017-18(April till August ), in 2018-19 the total figure remained at Rs.113.96crores and in the current year the total figures in the last five months was Rs.140.46crores, he added.
The EO also that the Gold deposits in the form of donations in the year 2018 from April to August is 344 kilos while in 2019 it was 524 kilos and the silver is 1,128 kilos in 2018 and 3,098 kilos in 2019.
He also said, the negotiations of Tirumala Special Officer Sri AV Dharma Reddy with various banks yielded good results in clearing the coin currency bags which have been lying with TTD since several years. “We are hopeful of clearing all the bags completely by this month end”, he maintained.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
TTD Trusts & Scheme Donations | ||||
Sl.No | Name of the Trust | 2017-18 upto 31 August 2017 |
2018-19 upto 31 August 2018 |
2019-20 upto 31 August 2019 |
1 | S V Annaprasadam Trust | Rs. 50.59 cr | Rs.54.92 Cr | Rs.65.07 Cr |
2 | Sri Balaji Arogyavara prasadini Scheme | RS.12.38 Cr | Rs.22.73 Cr | Rs.23.71 Cr |
3 | BIRRD Trust | Rs.3.51 Cr | Rs.8.85 Cr | Rs.7.33 Cr |
4 | SV Gosamrakshana Trust | Rs.7.14 Cr | RS.8.63 Cr | Rs.8.26 Cr |
5 | SV Pranadana Trust | Rs.6.75 Cr | Rs.5.56 Cr | Rs.10.43 Cr |
6 | SV Sarva sreyas Trust | Rs.2.35 Cr | Rs.4.78 Cr | Rs.6.02 Cr |
7 | SV Vidyadana Trust | Rs.3.54 Cr | Rs.4.49 Cr | Rs.8.96 Cr |
8 | SV VedaParirakshana Trust | Rs.2.77 Cr | Rs.1.95 Cr | Rs.6.60 Cr |
9 | SRIVANI+B10 Trust | ……. | ……. | Rs.92 Lakhs |
10 | Sri Srinivasa Sankara Netralaya Trust | Rs.2.35 Cr | Rs.1.36 Cr | Rs.2.73 Cr |
11 | SV Heritage Preservation Trust | Rs.53 Lakhs | Rs.69 Lakhs | Rs.43 Lakhs |
Total | Rs.91.91 Cr | Rs.113.96 Cr | Rs.140.46 Cr |
Tirumala Tirupati Devasthanams A Comparative Statement on different Acitivities at TTD -AUG, 2018 – 2019 |
||||||||||
S.No | Activity | 08/18 | 08/19 | Difference | % Diff (increase / Decrease) | |||||
1 | Darshan (in Nos.) | 19,16,752 | 24,02,801 | 4,86,049 | 25.4 | |||||
2 | Laddu Prasadam ( in Nos.) | 81,52,432 | 1,12,13,854 | 30,61,422 | 37.6 | |||||
3.a | Annaprasadam ( Food Items : MTVAC, VQC I & II inside, Outside Q lines, Food Counters, etc) ( in Nos.) | 43,32,238 | 52,73,605 | 9,41,367 | 21.7 | |||||
3.b | Annaprasadam ( Bevarages : VQC I & II inside, Outside Q lines, Food Counters, etc) ( in Nos.) | 25,67,200 | 27,42,900 | 1,75,700 | 6.8 | |||||
4 | Tonsuring ( Head Count in Nos.) | 7,90,749 | 10,95,656 | 3,04,907 | 38.6 | |||||
5 | Hundi Collection ( Rs. In Crores) | 84.05 Cr | 113.71 Cr | 29.66 Cr | 35.1 | |||||
6 | Revenue (Accommodation) ( Rs. In Crores) | 5.98 Cr | 6.90 Cr | 0.92 Cr | 15.4 | |||||
7 | Occupancy Ratio (Accommodation) in %ge | 93% | 104% | 11% | 2% | |||||
డయల్ యువర్ ఈవో ముఖ్యాంశాలు
తిరుమల, 2019 సెప్టెంబరు 06: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు :
– సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 20లోపు ఇంజినీరింగ్ పనులు పూర్తి చేస్తాం.
ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు :
– బ్రహ్మోత్సవాల్లో ఆలయంలో శ్రీవారి దర్శనంతోపాటు వాహనసేవలను తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. విఐపి బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ ప్రముఖులకే పరిమితం.
– సెప్టెంబరు 29(అంకురార్పణం) నుండి అక్టోబరు 8వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు పిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలు రద్దు.
– సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 10వ తేదీ వరకు టిటిడిలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రత్యేక దర్శనాలు, గదులు రద్దు.
– బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయింపు.
– అక్టోబరు 4న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 2 నుండి 4వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదు.
– ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని విఐపిలు, భక్తులు టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అన్నప్రసాద వితరణ :
– సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
– బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తాం.
– గరుడ సేవనాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
దర్శనం :
– గతేడాది ఆగస్టులో 19.16 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఆగస్టులో 24.02 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం :
– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఆగస్టులో రూ.84.05 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టులో రూ.113.71 కోట్లు వచ్చింది.
అన్నప్రసాదం :
– గతేడాది ఆగస్టులో 43.32 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఆగస్టులో 52.73 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.
లడ్డూలు :
– గతేడాది ఆగస్టులో 81.52 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఆగస్టులో 1.12 కోట్ల లడ్డూలను అందించాం.
గదులు :
– గదుల ఆక్యుపెన్సీ గతేడాది ఆగస్టులో 93 శాతం నమోదు కాగా, ఈ ఏడాది ఆగస్టులో 104 శాతం నమోదైంది.
—————————————————————–
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.