Ramanujacharya was a great Social Reformer : Chinna Jeeyar Swamy

Sri Ramanujacharya

Sri Ramanujacharya

The Sri Vaishnava Saint Sri Ramanujacharya was a great social reformer said, HH Sri Tirumala Chinna Jiyar Swamy.

Speaking during the inaugural session of Saint Ramanujacharya Jayanthi which commenced on a grant note in Annamacharya Kalamandiram at Tirupathi on Tuesday, he said, all the kainkaryams were introduced and streamlined by Sri Ramanujacharya across all Sri Vaishnava temples.

Later scholars Dr KTV Raghavan spoke on Ramanuja Vaibhavam while Dr Chakravarthi Ranganathan on Tatva Trayam.

Alwar Divya Prabandha Project Special Officer Dr PS Ganesh Murthy was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భగవద్‌ రామానుజులు గొప్ప సంఘ సంస్కర్త : టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి

మే 07, తిరుపతి, 2019: భగవద్‌ రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమానత్వాన్ని బోధించి గొప్ప సంఘసంస్కర్తగా నిలిచారని టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి ఉద్ఘాటించారు. భగవద్‌ రామానుజుల జయంతి ఉత్సవాలు మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 9వ తేదీ వరకు జరుగనున్న ఈ ఉత్సవాల్లో పండితుల ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామివారు అనుగ్రహభాషణం చేశారు. అప్పటికాలమాన పరిస్థితులకు అనుగుణంగా వైష్ణవ ఆలయాల్లో పూజావిధానాలను ఏకీకృతం చేసిన ఘనత రామానుజులవారికే దక్కిందన్నారు. భారతీయ సనాతన ధర్మంలో అద్వైతాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు, ద్వైతాన్ని శ్రీ మద్వాచార్యులు, విశిష్టాద్వైతాన్ని శ్రీ రామానుజాచార్యులు బోధించి ఆధ్యాత్మిక బీజాలను నాటారని తెలిపారు. భగవద్‌ రామానుజాచార్యులు సాక్షాత్తు ఆదిశేషుని అంశ అన్నారు. రామానుజాచార్యులు శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని పటిష్టంగా అమలుచేసి ఆలయాలను అభివృద్ధి చేశారని, తిరుమల శ్రీవారి ఆలయమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

అనంతరం తిరుపతికి చెందిన డా..కెటివి.రాఘవన్ “రామానుజ వైభవం” అనే అంశంపై, తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ “తత్త్వ త్రయం” అనే అంశంపై ఉపన్యసించారు.

ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| పిఎస్.గణేష్ మూర్తి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment