Sri Ramanujacharya Avatara Mahotsavams 2026, 20 April – 22 April

Sri Ramanujacharya

Sri Ramanujacharya

TTD has completed all arrangements to conduct the Sri Bhagavad Ramanujacharya Avatara Mahotsavams from April 20 to 22, 2026 at Annamacharya Kalamandiram under the aegis of the Alwar Divya Prabandha Project.

During these three days, literary sessions and devotional music programmes will be held daily from 6:00 PM to 8:30 PM.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                 

శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2026 ఏప్రిల్ 19: టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్యకళామందిరంలో ఏప్రిల్ 20 నుంచి 22వ తేదీ వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతారమహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ మూడు రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సాహితీ సదస్సులు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

ఏప్రిల్ 20న సాయంత్రం 5.30 గంటలకు తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామివారిమంగళాశాసనాలతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి.

 అనంతరం “శ్రీ రామానుజాచార్ల వైభవం”పై ఉపన్యాసం, తరువాత భక్తి సంగీత కార్యక్రమంజరుగుతుంది.

ఏప్రిల్ 21న “శ్రీ రామానుజాచార్లు – తిరుమల కైంకర్యము”పై ప్రసంగం, తరువాత హరికథ కార్యక్రమంఉంటుంది.

ఏప్రిల్ 22న “శ్రీ రామానుజాచార్లు – గ్రంథములు”పై ఉపన్యాసం, అనంతరం భక్తి సంగీత కార్యక్రమంనిర్వహించబడుతుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading