Punganur Kalyana Venkateswara Swamy Temple Pavitrotsavam

The annual Pavitrotsavam in Sri Kalyana Venkateswara Swamy temple at Punganur will be observed on August 5 with Ankurarpanam on August 4.

On August 5 morning, Snapana Tirumanjanam followed by Pavitra Samarpana will be performed while in the evening, Maha Purnahuti will be observed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 5న పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ‌ వెంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వం

ఇటీవ‌ల టిటిడి ప‌రిధిలోకి తీసుకున్న పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ‌ వెంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆల‌యంలో ఆగ‌స్టు 5న ప‌విత్రోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఆగ‌స్టు 4న ఉద‌యం ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 గంట‌లకు అంకురార్ప‌ణ, వాస్తు హోమం, అగ్నిప్ర‌తిష్ట‌, కుంభ‌స్థాప‌న‌, ప‌విత్ర ప్ర‌తిష్ట‌, ఉక్త‌హోమం నిర్వ‌హిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ప‌విత్రోత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఆగ‌స్టు 5న ఉద‌యం యాగశాలలో వైదిక కార్య‌క్ర‌మాలు, స్నపనతిరుమంజనం, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌డ‌తారు. సాయంత్రం యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాల అనంత‌రం రాత్రి 8 గంట‌ల‌కు పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా పవిత్రోత్సవం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment