Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Parjanya Shanti Homam performed in Kapileswara Swamy Temple, Tirupati

One of the phases of Kareeri Isthi-Varuna Yagam, Paranga Shanti Homam also known as Varuna Japam was performed in Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday.

TTD EO Sri Anil Kumar Singhal along with Tirupati JEO Sri B Lakshmikantham took part in the Varuna Japam at Kapilatheertham.

Every day the Varuna Japam will be observed in the temple between 9am and 12 noon till May 18.

On May 15 Ganapathi puja, Nadagdagan Puja, Rushyasringa puja, May 16 Theertha raja puja and shanti puja, May 17 Kareeri isthu puja and Jalapuja and on May 18 Maha shanti homam and purnahuti will be performed by rite ika.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్రోక్తంగా ప్రారంభ‌మైన వరుణజపం

తిరుపతి, 2019 మే 14: ప్రకృతిమాతను ఆవాహన చేసుకొని వరుణదేవుని కృపాకటాక్షాలు రాష్ట్రంపైన, దేశంపైన విస్తారంగా ఉండి సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ టిటిడి తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉద‌యం వరుణజపం(పర్జన్య శాంతి హోమం)ను శాస్రోక్తంగా ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ దంప‌తులు, తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం పాల్గొన్నారు.

కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజ‌యేంద్ర సరస్వతి శుభాశీస్సులతో ఈ యాగాలను టిటిడి నిర్వహిస్తున్న‌ది. ఇందులో భాగంగా ఆలయం వద్ద గల స్వామి పుష్కరిణిలో పలువురు రుత్వికులు వరుణ జపాన్ని ఆచరించారు. ఇందులో మొద‌ట‌గా గణపతి పూజతో ప్రారంభమై, క‌రీరిష్టి పూజ‌, పర్జన్య వ‌రుణ జ‌పం మంత్రాన్నిజపించి వరుణ దేవున్ని ప్రార్థించారు. ఈ యాగంలో 32 మంది రుత్వికుల 5 రోజుల పాటు పాల్గొంటున్నారు. ప్ర‌తి రోజు ఉద‌యం 9.00 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు యాగ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి.

కాగా మే 15వ తేదీ గ‌ణ‌ప‌తి పూజ, న‌వ‌గ్ర‌హ‌పూజ‌, ఋష్యశృంగ పూజ‌, మే 16న‌ తీర్థ రాజ పూజ‌, శాంతి పూజ‌, మే 17న కారీరిష్టి పూజ‌, జ‌ల పూజ నిర్వ‌హిస్తారు. మే 18వ తేదీ చివ‌రి రోజున శాంతిహోమం, మ‌హాపూర్ణాహుతితో వ‌రుణ జ‌పం ముగుస్తుంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ నాగ‌రాజు, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment