Sri Rama as Navaneetha Krishna in Vontimitta Brahmotsavams 4th day

vontimitta navaneetha krishna alankaram brahmotsavam

vontimitta navaneetha krishna alankaram brahmotsavam

Sri Rama as Navaneetha Krishna blessed devotees on 3 April 2023, the fourth day of ongoing annual brahmotsavams at Vontimitta Kodanda Ramalayam on Monday.

Deputy EO Sri Natesh Babu, Manuscript Special Officer Smt Vijayalakshmi, AEO Sri Gopal Rao and other staffs, devotees participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం

ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 03: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో రాముల‌వారు ముగ్ధ‌మ‌నోహ‌రంగా ద‌ర్శ‌న‌మిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్న‌దొంగ‌. రేప‌ల్లెలో బాల‌కృష్ణుడు య‌శోద‌మ్మ ఇంట్లోనే గాక అంద‌రి ఇళ్ల‌లోకి వెళ్లి వెన్న ఆర‌గించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీల‌ల‌ను గుర్తు చేస్తూ రాముల‌వారు వెన్న‌కుండ‌తో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపాలరావు, సూపరింటెండెంట్లు శ్రీ పి.వెంకటేశయ్య, శ్రీ ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading