Laksha Kumkumarchana in Tiruchanoor Temple, 16 November 2025 | Padmavathi Ammavari Brahmotsavams Ankurarpana… The ritual of prelude, Ankurarpanam for annual brahmotsavams at Tiruchanoor, will be observed on the evening of 16 November 2025 while the celestial Laksha Kumkumarchana is performed on the same day morning.
This unique puja with vermilion will be performed from 8am till 12 noon.
In the evening from 6pm onwards, Punyahavachanam, Raksha Bandhanam, Senadhipati Utsavam will be observed in Yagasala as a part of Ankurarpanam.
Meanwhile on November 17, the Navahnika Karthika Brahmotsavams of Sri Padmavati Ammavaru will commence with Dhwajarohanam in the auspicious Dhanur Lagnam between 9:15am and 9:30am.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబరు 16న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
– ఉదయం లక్ష కుంకుమార్చన
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 16వ తేదీ అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
నవంబరు 17న ధ్వజారోహణం
ఆలయంలో నవంబరు 17న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
17 November 2025
ఉదయం – ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం)
రాత్రి – చిన్నశేషవాహనం
18 November 2025
ఉదయం – పెద్దశేషవాహనం
రాత్రి – హంసవాహనం
19 November 2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం
రాత్రి – సింహవాహనం
20 November 2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – హనుమంత వాహనం
21 November 2025
ఉదయం – పల్లకీ ఉత్సవం
రాత్రి – గజవాహనం
22 November 2025
ఉదయం – సర్వభూపాలవాహనం
సమయం – స్వర్ణరథం,
రాత్రి – గరుడవాహనం
23 November 2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
24 November 2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వ వాహనం
25 November 2025
ఉదయం – పంచమీతీర్థం
రాత్రి – ధ్వజావరోహణం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.