Tulasi Mahatmyam Utsavam in Govindarajaswamy Temple, Tirupati

Tulasi Mahatmyam Utsavam in Govindarajaswamy Temple, Tirupati… Sri Govindaraja Swamy to Bless Devotees on Garuda Vahanam Tulasi Mahatyam Purana Recital to Mark the Occasion.

TTD will conduct the sacred Tulasi Mahatyam Utsavam at Sri Govindaraja Swamy Temple, Tirupati, on July 26 with religious fervour.

The festival is observed on Sravana Sukla Dwadasi to commemorate the appearance of Tulasi Devi, who is considered most dear to Lord Srimannarayana.

On the occasion, Sri Govindaraja Swamy will bless devotees on Garuda Vahanam from 4.30 a.m. to 6.30 a.m., taking a procession through the four Mada Streets.

Later, Asthanam will be held from 6.30 a.m. to 7.30 a.m., during which temple priests will recite the Tulasi Mahatyam Purana and explain the significance of Tulasi Devi.

 Theertha Prasadam will be distributed to devotees afterwards.

TTD has invited devotees to participate in the sacred festival and receive the blessings of Sri Govindaraja Swamy.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

జూలై 26 శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా తులసి మహత్యం ఉత్సవం

గరుడవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ గోవిందరాజస్వామివారు

తులసి మహత్యం పురాణ పఠనంతో ఆధ్యాత్మిక విశేషం

తిరుపతి, 2026 జూలై 22: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 26వ తేదీన పవిత్రమైన తులసి మహత్యం ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసీదేవి ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ శ్రావణ శుద్ధ ద్వాదశి సందర్భంగా ఈ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనభాగ్యం కల్పించనున్నారు.

గరుడవాహన సేవలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడం ద్వారా భక్తులకు విశేష పుణ్యఫలాలు లభిస్తాయని ఆగమాలు పేర్కొంటున్నాయి.

అనంతరం ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు తులసి మహత్యం గురించి పురాణ పఠనం చేసి తులసీదేవి వైభవాన్ని భక్తులకు వివరిస్తారు.

 అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు.

ఈ దివ్య ఉత్సవంలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ భక్తులను ఆహ్వానిస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది —

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading