Andal Tiruvadipuram 2026 at Tirupati Govindaraja Swamy Temple

Andal Tiruvadipuram 2026 at Tirupati Govindaraja Swamy Temple

The annual Sri Andal Thiruvadipuram Utsavam will be celebrated at Sri Govindaraja Swamy Temple, Tirupati, from August 5 to 14 with religious fervour in 2026.

During the festival, Tirumanjanam will be performed to Sri Andal every morning, followed by Asthanam in the evening.

On August 14, the concluding Sattumora will be observed. Snapana Tirumanjanam for the processional deities of Sri Govindaraja Swamy and Sri Andal will be held from 9.30 am to 10.30 am. A grand procession to Alipiri with Asthanam will take place from 4 pm to 8 pm, followed by a return procession through Geetha Mandiram, Sri Vikhanasacharya Temple, and Sri Chinna Jeeyar Mutt. The festival will conclude with Sattumora at 8 pm in Sri Andal’s shrine.

TTD has appealed to devotees to participate in large numbers and receive the divine blessings of Sri Govindaraja Swamy and Sri Andal.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

ఆగస్టు 5 నుంచి 14 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 5 నుండి 14వ తేదీ వరకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులు అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందనున్నారు.

ఆగస్టు 14న శాత్తుమొర మహోత్సవం

ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆగస్టు 14న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి మహోత్సవ ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక పూజల తర్వాత అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స్‌లోని గీతా మందిరం, ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్‌ మఠం మీదుగా దివ్య ఊరేగింపు ఆలయానికి చేరుకుంటుంది.

రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహించి ఉత్సవాలకు మంగళం పలుకుతారు.

ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading