Tallapaka Chennakesava Swamy Temple Brahmotsavams 2026, 25 July-2 August.. The annual Brahmotsavams of Sri Chenna Kesava Swamy temple in Tallapaka of Annamaiah district are scheduled from July 25 to August 2 with Ankurarpanam on July 24.
The Ankurarpanam for the annual Brahmotsavams of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy temples at Tallapaka, the birthplace of Saint Annamacharya, will be held on July 24. The Brahmotsavams will be celebrated from July 25 to August 2, followed by Pushpayagam on August 3.
The festivities include Dwajarohanam, daily Vahana Sevas, Garuda Seva, Rathotsavam, Kalyanotsavam, Parveta Utsavam, Chakrasnanam, Vasanthotsavam, and Dhwajavarohanam. Special Arjitha Kalyanotsavam will be held on July 30 in both temples.
Devotional discourses, Harikatha, and spiritual music programmes will also be organised daily by the TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project during the festival.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జూలై 24న తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
జూలై 25 నుంచి ఆగస్టు 2 వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు – ఆగస్టు 3న పుష్పయాగం
తిరుపతి / తాళ్లపాక, 2026 జూలై 23: అన్నమాచార్యుల జన్మభూమి తాళ్లపాకలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 25 నుంచి ఆగస్టు 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముందుగా జూలై 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు రెండు ఆలయాల్లో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో
జూలై 25న ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, రాత్రి శేషవాహన సేవ జరుగుతుంది.
ఉత్సవాల్లో భాగంగా…
జూలై 26 – ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంసవాహనం
జూలై 27 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం
జూలై 28 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనం
జూలై 29 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడసేవ (ప్రత్యేక ఆకర్షణ)
జూలై 30 – సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం
జూలై 31 – సాయంత్రం 6 గంటలకు రథోత్సవం
ఆగస్టు 1 – రాత్రి అశ్వవాహనం
ఆగస్టు 2 – ఉదయం 10 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో
జూలై 25న ఉదయం 6.05 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, రాత్రి హంసవాహన సేవ జరుగుతుంది.
ఉత్సవాల విశేషాలు…
జూలై 26 – ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం
జూలై 27 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం
జూలై 28 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం
జూలై 29 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి నందివాహనం
జూలై 30 – సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం, అనంతరం గజవాహనం
జూలై 31 – సాయంత్రం పల్లకీ సేవ
ఆగస్టు 1 – సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం
ఆగస్టు 2 – వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం
ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.
ఆర్జిత కల్యాణోత్సవం
రెండు ఆలయాల్లోనూ జూలై 30న ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.300/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం, అన్నప్రసాదం అందజేయనున్నారు.
ఆగస్టు 3న పుష్పయాగం
ఆగస్టు 3న ఉదయం శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరగనుంది.
ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.