తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి – మార్చి 20, 2019

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరములో వెలసివున్న ప్రముఖ పుణ్యతీర్థమగు శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 20వ తారీఖున అత్యంత వైభవంగా తిరుమలలో జరుగనుంది.

పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి, ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థములు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరించిన యెడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైశిష్ట్యం.

పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading