Vontimitta Temple’s Koil Alwar Tirumanjanam 2019

The traditional temple cleansing fete Koil Alwar Tirumanjanam was performed in the ancient temple of Sri Kodanda Rama Swamy at Vontimitta in Kadapa district on Tuesday in connection with annual brahmotsavams which are going to commence from April 12 onwards with Ankurarpanam.

An amalgamation of aromatic ingredients including vermilion, turmeric, Kichiligadda(a root), sandal paste was made into a fine paste and smeared all along the walls, roofs etc. in the entire temple. The puja utensils were also cleaned.

Temple AEO Sri Ramaraju, Archakas and other staffs took part in this cleansing fete.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఒంటిమిట్ట, 2019 ఏప్రిల్‌ 09: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్‌ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8.00 నుండి 12.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీపి.రామరాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

వాహన సేవలు :

తేదీ ఉదయం సాయంత్రం

13 April 2019(శనివారం) ధ్వజారోహణం(వృషభలగ్నం) శేష వాహనం

14 April 2019(ఆదివారం) వేణుగానాలంకారము హంస వాహనం

15 April 2019(సోమవారం) వటపత్రశాయి అలంకారము సింహ వాహనం

16 April 2019(మంగళవారం) నవనీత కృష్ణాలంకారము హనుమత్సేవ

17 April 2019(బుధవారం) మోహినీ అలంకారము గరుడసేవ

18 April 2019(గురువారం) శివధనుర్భంగాలంకారము కళ్యాణోత్సవము/ గజవాహనము

19 April 2019(శుక్రవారం) రథోత్సవం ———–

20 April 2019(శనివారం) కాళీయమర్ధనాలంకారము అశ్వవాహనం

21 April 2019(ఆదివారం) చక్రస్నానం ధ్వజావరోహణం.

ఏప్రిల్‌ 22వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Write Your Comment